టెన్త్ లో మండల టాపర్లు దగ్గు కావ్యశ్రీ, అల్లా వైష్ణవి లకు ఘన సన్మానం
విద్యా విజయోత్సవంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు ప్రశంసలు
జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ గిరిరాజ్ గౌడ్ ప్రశంసలు
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి మే 17ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విద్యా విజయోత్సవం కార్యక్రమంలో ఎల్కతుర్తి మండలంలో పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ఘనంగా సత్కరించారు.మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దగ్గు కావ్యశ్రీ, ద్వితీయ స్థానం సాధించిన ఆళ్ల వైష్ణవిలకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ గిరిరాజ్ గౌడ్ శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.అనంతరం గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత, ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ విద్యార్థినులను ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ పొనగంటి శ్వేత మాట్లాడుతూ కావ్యశ్రీ, వైష్ణవిలు గ్రామానికి గర్వకారణమని అన్నారు.భవిష్యత్తులో కూడా క్రమశిక్షణ, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కృషితో ఉన్నత ఫలితాలు సాధించగలరని ఈ విద్యార్థినులు నిరూపించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బద్దం సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకట సుహాసిని, పద్మలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.











