క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రికెట్ పోటీలు నిర్వహణ…
టోర్నమెంట్ స్పాన్సర్‌గా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మండలంలోని కోడవటూర్ గ్రామంలో గల ప్రసిద్ధ సిద్దులగుట్ట గ్రౌండ్లో మే 30వ తేదీ నుండి మండల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా సర్పంచ్ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమండలంలోని క్రికెట్ క్రీడాకారులకు, అభిమానులకు ఇది ఒక సువర్ణ అవకాశమని, క్రీడాకారులు తమలో దాగున్న ప్రతిభను ఈ వేదిక ద్వారా చాటుకోవాలని కోరారు.ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 20,000, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 10,000 నగదు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 30న ప్రారంభం కానున్న ఈ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయాలని క్రీడా అభిమానులను పిలుపునిచ్చారు. ఈ పోటీల నిర్వహణబాధ్యతలను శివ కుమార్, శ్రవణ్ కుమార్, నితీష్, మరియు దుర్గా ప్రసాద్‌లు చూసుకుంటున్నారు.











