యువకుడి అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటు
ఆర్థిక సహాయం అందించిన గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు నల్ల వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబాన్ని మాజీ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి శనివారం పరామర్శించారు.వెంకటేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
Post Views: 67











