మానవత దృక్పథంతో సర్పంచికి సహాయం అందించిన మండల సర్పంచులు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ దంపతులు ఆ కుటుంబం త్రీవ శ్లోకంలో ఉన్నది. మండలంలో ఉన్న సర్పంచులు మానవత దృక్పథంతో అందరూ కలిసి ఆ కుటుంబానికి వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం జమ చేసి 25 వేల రూపాయలు అందించారు. వారి ఇంటికి వెళ్లి ఆ యువకుడు చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. మహిళా సర్పంచికి నగదు అందించి ఓదార్చారు. కొడుకును కోల్పోయి నా బాధ ఎవరు తీర్చలేరని ఆ భగవంతుడు వారికి ఓదార్పునియాలని ఆ దేవుడిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎండి ఫిరోజ్, ఇజ్జగిరి రాములు,శ్రీధర్ గౌడ్, నీల కవిత మురళి, జిల్లెల్ల భాస్కర్ రెడ్డి, గీససందీప్, ఎండి ఆజాం, బంగారురవి, ఆరే రవి, చంద్రకళ స్వామి, స్వప్న శ్రీనివాస్, జెర్రీ పోతుల రాజు తదితరులు పాల్గొన్నారు.











