వానకోసం గ్రామ బొడ్రాయి గ్రామ దేవతకు పూజలు
స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 19, (దిశ పవర్): స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పామునురు గ్రామంలో గ్రామ సర్పంచ్ పోలెపల్లి సంపత్ రెడ్డి ఆద్వర్యంలో గ్రామ బొడ్రాయి గ్రామ దేవతకు గ్రామస్తులందరూ జలాభిషేకం చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు భారీగా తరలివచ్చి గ్రామ దేవతకు జలాభిషేకం చేసి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడీ, పంటలు పండాలని కోరుకోవడం అభినందనీయమని అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న రైతులకు సకాలంలో వర్షాలు కురువక బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారని అన్నారు. మూగ జీవాలు సైతం గడ్డి, గ్రాసం లేక విలవిల లాడుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 98











