రాయపర్తి, జూలై 11 (ప్రజా గొంతుక): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో షాలోని కుంట సమీప రహదారిపై ప్రమాదకరంగా వేలాడుతున్న చెట్టు కొమ్మలను వెంటనే తొలగించాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులను కోరారు.గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న చెట్టు సగం విరిగి రోడ్డువైపు వాలిపోవడంతో ఎప్పుడు విరిగి పడుతుందోననే భయాందోళన నెలకొంది. ఈ మార్గంలో ప్రతిరోజూ వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా గాలివానలు, భారీ వర్షాల సమయంలో చెట్టు కొమ్మలు విరిగి పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరమైన చెట్టు కొమ్మలను తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 26











