బచ్చన్నపేట, జూలై 24 (దిశ పవర్):భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేట మండల కేంద్రంలోఉప సర్పంచ్ బైరి రజిత వెంకటేష్ వార్డ్ మెంబర్ లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ మరింత బలోపేతం కావాలని, కేటీఆర్ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఐటీ రంగంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన సేవలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివరాత్రి రాజు, కక్కర్ల విజయలక్ష్మి–విజయ్ కుమార్, కర్రె బాస్కర్, దేవరకొండ మల్లేశం, గర్నపల్లి అంజయ్య, ముద్దసాని నవ్య–అనిల్, కక్కర్ల ఉమారాణి–శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, మచ్చ సతీష్, బొమ్మెన సందీప్, పుల్లయ్య, బండ నరేష్ తదితరులు పాల్గొని కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.











