జనగామ, జూలై 31 దిశ పవర్ మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం జనగామ మీదుగా వరంగల్ జిల్లా నల్లబెల్లి వైపు తరలిస్తున్న సందర్భంగా జనగామలో బచ్చన్నపేట మండలం చెందిన బిఆర్ఎస్ పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్, ఈదుల కంటి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత చిత్రాలతో కూడిన నివాళి ఫలకాలు చేతబట్టి నాయకులు, సర్పంచులు రహదారి వెంట నిలబడి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడని కొనియాడారు. ఆయన మరణం రాజకీయ రంగానికే కాకుండా ప్రజలకు, అభిమానులకు తీరని లోటని అన్నారు. ఈ నివాళి కార్యక్రమంలోసర్పంచులు మద్దికుంట రాధ, నూకల కల్పన రాజిరెడ్డి, నీల కవిత మురళి, కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.











