దిశ పవర్ బచ్చన్నపేట మండలం సాల్వాపూర్, ఆగస్టు 5: గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సాల్వాపూర్ గ్రామ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్ అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, సానిటరీ, హానికర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేయాలని గ్రామస్తులకు సూచించారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా గ్రామ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని తెలిపారు.అనంతరం గ్రామస్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వల్లూరి కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి బి. యాకన్న, వార్డు సభ్యులు నిమ్మల రాజు, చీర్ల కుమార్, సాబుసు వెంకటేష్, ఎల్కపల్లి అనిత, చీర్ల లత, నరిగే సుమలత, అంగన్వాడీ టీచర్లు వల్లూరు సిద్ధమ్మ, అనరాజు శ్రీలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుకర్ రెడ్డి, వేణుగోపాల్, ఏఎన్ఎం స్వాతి, గ్రామస్థులు పాల్గొన్నారు











