దిశ పవర్ బచ్చన్నపేట: తల్లిపై ఉన్న ప్రేమను సమాజ సేవగా చాటుతూ సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా రవీందర్ తన అమ్మ పేరు మీద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ప్రజలకు అన్నదానం చేయడం ద్వారా ఆయన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.పేదలు, నిరుపేదలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశారు. తల్లి పేరు మీద అన్నదానం నిర్వహిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న జిల్లా రవీందర్‌ను పలువురు అభినందించారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఆయన సేవా స్పూర్తిని స్థానికులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో రవీందర్ కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో జిల్లా బుచ్చయ్య, జిల్లా రాజు, సర్పంచ్ అల్వాల నర్సింగరావు, బాలకిషన్ గౌడ్, సుధాకర్ రెడ్డి, నర మహేందర్ రెడ్డి, దేవరకొండ రమేష్, మచ్చ సుధాకర్, ఎండి గౌస్, వడ్డేపల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.తల్లి పేరు మీద మహా అన్నదానం నిర్వహించిన జిల్లా రవీందర్ సేవా కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలిచింది.











