దిశ పవర్ రాయపర్తి, అక్టోబర్ 8:వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రాయపర్తి మండలం మైలారం గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ మైలారం గ్రామ సమీపంలో వంగ సరస్వతి (55)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Post Views: 185











