*ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దుతాం.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 26 మార్చి 2026.
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్.
మున్సిపల్ యంత్రాంగంతో 24వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ , స్థానిక వార్డు కౌన్సిలర్,నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్.
– 24వ వార్డులో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను,పారిశుధ్యం, మెరుగైన సిసి రోడ్లకై,మరియు డ్రైనేజీ వ్యవస్థను వారు పరిశీలించారు..
– రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అవసరమున్న చోట నూతన బోర్లు వేసి మోటర్లు అమర్చుతామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు.
– అదేవిధంగా వార్డులోని జీడయ్య పల్లె ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు.
– ప్రతి వార్డును పారిశుధ్య రహితంగా తీర్చిదిద్దుతామని.
– మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 17వ కౌన్సిలర్ అయూబ్ ఖాన్,24వ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











