కార్మిక పోరాటాల పై నిర్బంధాన్ని ఆపాలి……

కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలి……..
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు……. సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చలో హైదరాబాద్ నిర్వహిస్తున్న కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని *సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నిడమనూరు మండల కేంద్రంలోని సిఐటియు గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ఎన్నికల ముందర అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయాలని కార్మిక వర్గం తమ హక్కుల కోసం చలో హైదరాబాద్ నిర్వహిస్తుంటే ఎక్కడికక్కడ దొంగలను రౌడీలను అరెస్టు చేసినట్లు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందర కార్మికులందరికీ కనీస వేతనాలు ఇస్తామని పర్మనెంట్ చేస్తామని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో రాసి అనేక సభల్లో చెప్పిన మంత్రులు ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్కరి సమస్య పరిష్కరించలేదని విమర్శించారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి అమలు చేయమంటే ఈ రాష్ట్రంలో బిజెపి వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ అవే చట్టాలను, అవే విధానాలను వేగంగా అమలు చేస్తూ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అన్ని రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గత టీఆర్ఎస్ కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. అనంతరం గ్రామ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కన్వీనర్ గా వింజమూరి శివ, కో కన్వీనర్లు గా గుత్తా శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల కేశవులు*, లను ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య, వింజమూరి పుల్లయ్య, వెంకటమ్మ, మంగమ్మ, సైదమ్మ, మేరమ్మ, సైదమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు











