రాముడే వచ్చి చెప్పినా మారూనా ఈ మన లోకం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:27
ప్రజలంరికీ ఆదర్శప్రాయుడు శ్రీ రాముడు – మనం అందరం కూడా శ్రీరాముడి లాగా ఆదర్శప్రాయంగా ఉందాం.రామగిరి రామాలయం దగ్గర సీన్ మామూలుగా లేదు..శ్రీరాముడి గెటప్‌లోనే డ్రగ్స్, గంజాయి మీద గట్టిగా వార్నింగ్ ఇచ్చిన రాచకొండ ప్రభాకర్ మాస్టారు
ఈ మత్తు పదార్థాలు నీ జిందగీ తిప్పేస్తాయి.మీ కుటుంబాలను ఆగమాఆగం చేస్తాయి.అంటూ యూత్‌కి స్వామి శ్రీరాముని వేషధారణలో క్లియర్ మెసేజ్ ఇచ్చిన ఉపాధ్యాయుడు
ఒక్కసారి ఆలోచించండి… కుటుంబం, భవిష్యత్తు అన్నీ నాశనం అవుతాయి.
రోడ్డు మీద కూడా అదేపనిగా అవగాహన..హెల్మెట్ పెట్టుకో..సీట్ బెల్ట్ కట్టుకో.. స్పీడ్ తగ్గించుకో…అంటూ శ్రీరాముడే చెప్పినట్టుగా ప్రచారం…
చూసిన జనాలు షాక్.! ఆలోచనలో పడిపోయిన యూత్..
భక్తి గెటప్‌లో సోషల్ మెసేజ్.. అదిరిపోయిన మాస్టారు ఐడియా…
స్వామి నామం జపిస్తే చాలదు.. మన ధర్మం చెప్పే మాటలు కూడా వినాలి కదా!











