ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఆసక్తి సీనియర్ల విజ్ఞప్తి

ప్రజా గొంతుక మార్చి 29:
ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకాలం ముగియడంతో, కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని మండలంలోని సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ మేరకు మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు మాజీ అధ్యక్షుడికి మెమొరాండం అందజేసినట్లు సమాచారం.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు తమకు తెలిసిన విధంగా అధ్యక్ష పదవిని తమ మండలానికి దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదవిని ఎల్కతుర్తి మండలానికే కేటాయించాలని స్థానిక నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులతో, మాజీ ఎమ్మెల్యే కీ,శేలు కేతిరి సాయిరెడ్డి కీ,శే;లు.హుజారాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ కేతిరి సుదర్శన్ రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో మంచి పరిచయాలు ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు ప్రజలవద్ధకె పాలన పెట్టీనా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలవద్ధకె పాలన జరుగకుండా బిఆర్ ఎస్ కార్యకర్తలు గ్రామంలో చెట్లు కొట్టేసి అడ్డం పెట్టిన. గ్రామంలో ప్రజలవద్ధకె పాలన ఎదవిదిగ నడిపిచ్చిన నాయకుడు అతనె పనిచేసిన అనుభవం కలిగి, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా పార్టీ కార్యకర్తల్లో మంచి మద్దతు పొందుతున్నట్లు తెలుస్తోంది.మొన్నజరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టి మంచి మెజారిటీతో గెలిపించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దగ్గర శభాష్ అనిపించుకున్నారు
మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఈ నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనకు పార్టీపై నిబద్ధత, అనుభవం, గ్రామ స్థాయి పరిజ్ఞానం ఉన్నందున అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.
అధిష్టానం కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అయితే తుది నిర్ణయం ఎవరికోసం ఉంటుందో చూడాల్సి ఉంది.











