సంగారెడ్డి లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి మార్చ్ 29 ( ప్రజా గొంతుక )
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మెదక్ పార్లమెంట్ టిడిపి కన్వీనర్ ఇల్లేందుల రమేష్ మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తధనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, సంగారెడ్డి ఎక్స్ రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఇల్లేందుల రమేష్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్బావము ఒక సంచలనం అని బడుగు బలహీన వర్గాల జీవితాలను లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మహనీయులు ఎన్టీఆర్ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయిన పార్టీ చెక్కు చెదరలేదని పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో నే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి అధికారం లోకి వచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం లు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ది అని ఈ సందర్బంగా తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ ను అభివృద్ధి పదంలో నడిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ను అగ్రగామిగా నిలబెట్టారాని అ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా ఎన్ని ప్రతిష్టత్మాక ప్రాజెక్ట్ లు తీసుకువచ్చి ఎన్నో లక్షల మంది యువత కు ఉపాధి కల్పించి వాళ్ళ జీవితాలలో ఘననీయమైన మార్పులు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ సందర్బంగా మాజీ జిల్లా పరిషత్ చేర్మెన్ అర్. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత నే తెలంగాణ లో పటేల్, పట్వారీ వ్యవస్థ ను రూపుమాపి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం పదవులు తీసుకువచ్చిందని ఈ సందర్బంగా తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ముద్ర బలంగా ఉందని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ టిడిపి కన్వీనర్ ఇల్లేందుల రమేష్ తో పాటు మాజీ జిల్లా పరిషత్ చేర్మెన్ అర్. శ్రీనివాస్ గౌడ్ పార్లమెంట్ ఆడహాక్ కమిటీ సభ్యులు బందెన్న గౌడ్ , ప్రకాష్ , నాగేంద్ర గౌడ్ (నాని ), సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.











