*ప్రతి ఇంట్లో చదువుకున్న మహిళ అవసరం సర్పంచ్*

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా సమైక్య ఏపిఎం అనిత ఆధ్వర్యంలో ఉల్లాస్ అమ్మకు అక్షరమాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంఈఓ చంద్రమౌగిళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఈ కేంద్రంలో 650 మంది వయోజనులకు ఉల్లాస్ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో చదువుకున్న మహిళ ఉంటేనే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా చదువుకున్న వారు పరీక్షలు రాయడానికి ఈ వయోజన అక్షరాస్యత కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వివోల అధ్యక్షులు, సిసిలు, సిఎలు తదితరులు పాల్గొన్నారు.











