తాళ్ల చైతన్యకు పి హెచ్ డి పట్టా ప్రధానం
ప్రజా గొంతుక మార్చి 30 కాజీపేట మండల ప్రతినిధి మహేందర్ రెడ్డి:హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (టిపిసిఈ)లో జరిగిన కార్యక్రమంలో తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ తాళ్ల చైతన్యకు కెఎల్ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసినట్లు చైర్మన్ తాళ్ల మల్లేశం తెలిపారు.చైతన్య “ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్, బెంజిమిడజోల్ ఉత్పన్నాల సంశ్లేషణ మరియు జీవసంబంధిత స్క్రీనింగ్” అంశంపై తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశోధన క్యాన్సర్ నిరోధక ఔషధాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు.ఆమె పరిశోధన సమయంలో అంతర్జాతీయ స్థాయి SCI, Scopus జర్నల్స్‌లో నాలుగు పత్రాలు, జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లలో నాలుగు పత్రాలు ప్రచురించారు.
ఈ సందర్భంగా తాళ్ల మల్లేశం మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఇప్పటికే డాక్టర్ తాళ్ల వంశీ, డాక్టర్ తాళ్ల వరుణ్ డాక్టరేట్లు పొందగా, ఇప్పుడు కోడలు చైతన్య కూడా పీహెచ్డీ సాధించడం గర్వకారణమన్నారు.
ఈ విజయంతో తాళ్ల పద్మావతి విద్యాసంస్థల పరిశోధన కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థులు చైతన్యను అభినందించారు..











