అంబేద్కర్ వేషధరణ చిత్రపటాన్ని అందజేసిన స్కూల్ యజమాన్యం

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 04:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ చిన్న కుమారుడు గణతంత్ర దినోత్సవ వేడుకలలో.. అంబేద్కర్ వేషధారణలో ప్రతిభను చూపించడం జరిగింది.. శంషాబాద్ మండల కేంద్రంలోని పెద్ద గోల్కొండ లో శ్రీ జ్ఞాన సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ లో సృజన్ తేజ్ ఎల్ కే జీ చదువుతున్నాడు అదే క్రమంలో.. జనవరిలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో.. అంబేద్కర్ వేషధారణలో పాల్గొని అందర్నీ ఆకర్షించినందుకు.. పెద్ద గోల్కొండ శ్రీ జ్ఞాన సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ యజమాన్యం.. చేతుల మీదుగా చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది.. ఈ సందర్భంగా జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… మొట్టమొదటిగా పిల్లలని వాళ్ళ ప్రతిభను గుర్తించి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు అంతే కాకుండా ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో తల్లిదండ్రులు వేషధారణలో స్కూల్ కి పంపినట్లయితే స్కూల్ కి మంచి పేరు వస్తుందని అలాగే తల్లిదండ్రులకి మంచి గుర్తింపు ఉంటుందని తెలియజేశారు వాటితో పాటు విద్యార్థిని విద్యార్థులకు క్రీడలలో ప్రోత్సహించాలని అన్ని రంగాలలో పిల్లలు ఎదిగే విధంగా ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని ముఖ్యంగా. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన అనంతరం పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా దగ్గరుండి వాళ్లకు కావాల్సినవి నేర్పించినట్లయితే స్కూల్లోనే ఉత్తమ విద్యార్థులుగా రాణిస్తారని ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ పేర్కొన్నారు











