డిగ్రీ విద్యకు దూరం అవుతున్నా విద్యార్థులు.
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరీక్షా కేంద్రం దూరమవు బాబు దూరండిగ్రీ మొదటి, రెండు,మూడు, నాలుగు,5,ఆరు సెమిస్టర్ పరీక్ష 2026 ఏప్రిల్ 20వ తేదీ నుండి జరుగుతున్నవి చర్లలోచదువుతున్న గౌతమి కళాశాల మరియు భద్రాద్రి కళాశాల విద్యార్థిని విద్యార్థులకు చర్ల నుండి 60 కిలోమీటర్లు దూరమున్న భద్రాచలంలో పరీక్షా కేంద్రాన్ని వేయడం జరిగింది ఈ పరీక్షా కేంద్రానికి రోజు వెళ్లి రావడానికి సుమారు350నుంచి400 రూపాయలు ఖర్చవుతుంది.వీరు చర్ల చుట్టుపక్కల ఉన్న సుమారు 40 కిలోమీటర్లు దూరం నుండి చర్లవచ్చిచదువుకుంటున్నారు వీరిని భద్రాచలం పరీక్షా కేంద్రం వేయడం వల్ల చాలామంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు హాజరు కాలేకపోతున్నారు ఈ ఎండాకాలం ఎండలు విపరీతంగా రావడం రోడ్డు సరిగ్గా లేకపోవడం రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని చర్లలో పరీక్ష కేంద్రం నిర్వహించాలని విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.ఉదయం పరీక్షకు హాజరు కావాలి అంటే ఉదయం నాలుగు గంటలకే లేచి చర్ల బస్టాండ్ కి ఆరింటి లోపల రావాలి.బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మ్యాజికులకు వెళ్లడం సొంత బండ్లపై వెళ్లడం ప్రమాదాలు గురవడానికి కారణం అవుతున్నాయి.సాయంత్రం 6 గంటల తర్వాత బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ సమయానికి లేవు..ఇంటికి చేరేలోపు రాత్రి 9అవుతుంది దీని కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే. చొరవ తీసుకొని పరీక్షా కేంద్రాన్ని చర్ల లో వచ్చేలా చూడాలని తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు.సుదూర పరీక్ష కేంద్రంతో విద్యార్ధుల ఇక్కట్లు.తెలిసిన పట్టనట్టు ఉన్న కాకతీయ యూనివర్సిటీ అధికారులు.చర్ల లోని స్థానిక ప్రవేటుడిగ్రీ కళాశాల లు రెండు ఉండగా వీరికి మండల కేంద్రం నుంచి సుమారుగా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం లో ఉన్న కళాశాలలలో పరీక్ష కేంద్రం కేటాయించారు.చర్ల చుట్టుపక్కల గిరిజన గ్రామాలలోని విద్యార్థులు మండల కేంద్రం చేరుకొని అక్కడినుంచి అనేక కష్టాలతో భద్రాచలం వెళ్లి పరీక్షలు రాయవలసి వస్తుంది.ఈ కాలేజీ లలో అత్యధికంగా చదివే విద్యార్థులు గిరిజన విద్యార్థులు అవడం చేత పరీక్ష రాయడం కోసం వెళ్లడానికివారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది.
ఇందువల్ల ప్రతి సంవత్సరం దాదాపు50%కిమించిన విద్యార్థులు పరీక్షలు రాయకుండా ఆబ్సెంట్ అవుతున్నారు.వారి భవిష్యత్ డిగ్రీ అవకుండానే ముగుస్తుంది.ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో స్పందించి స్థానికంగా పరీక్షలకు సెంటర్ ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలని సత్వరమే పరీక్ష కేంద్రం చర్లలో ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.











