*పెద్దపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…*
*ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన గ్రామ విద్యార్థులను సన్మానించిన…*
*పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి..*
అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా గద్వాల జిల్లా పరిధిలోని మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో పంచాయతి కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటాన్నికి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు,పంచాయతి సెక్రటరీతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం ఈ విద్య సంవత్సరంలో గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ తో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సన్మానం చేసి గ్రామస్థుల సమక్షంలో అభినందించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తుందని…అంబేద్కర్ దళితులకు ఒక స్ఫూర్తి , దళితుల కొరకు చాలా కష్టపడి హక్కులు కల్పించేలా రాజ్యాంగం రూపొందించారని కొనియాడారు…. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు పాల్గొన్నారు.











