ప్రజల గొంతుకగా నిలబడుతాం.
*- నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు కదలిరండి..*
*- ధరూర్ మండల కేంద్రంలో గోడపత్రికలను ఆవిష్కరించిన…*
*- ఎన్.హెచ్.పీ.ఎస్ మరియు తెలంగాణ జాగృతి నాయకులు..*
జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలో నూ తన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత ఆవిర్భవిం చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్య క్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరు ల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు.తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమం లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్,మునెప్ప,ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకు లు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు,గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.











