పెట్రోల్, డీజిల్ బంకులు నో స్టాక్ బోర్డులతో ముసివేత … వరి కోత యంత్రాలకు తీవ్రమైన ఇబ్బందులు….
ప్రజా గొంతుక (ఏప్రిల్ 26) కాల్వ శ్రీరాంపూర్ : వ్యవసాయ అవసరాలకు అందని డీజిల్, ఆందోళనలో రైతులు, నో స్టాక్ బోర్డ్ లతో పెట్రోల్ బంక్ లు మూసివేత, పెట్రోల్ కటకట వాహనదారుల తిప్పలు.. నిన్నటి దాకా గ్యాస్ కష్టాలు… తాజాగా డీజిల్ పెట్రోల్ కొరత ప్రజల ఇబ్బందులు..మండలంలోని పెట్రోల్ బంకులల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతలు తీవ్ర రూపం దాల్చింది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా ఉంది. వాహనదారులు, రైతులు, అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల వద్ద వరి కోత యంత్ర యజమాన్యం,ట్రాక్టర్ యజమానులు, డీజిల్ కొరతతో వరి కోతలు ఆపే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. కొన్ని రోజుల నుండి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనబడుతూనే ఉన్నాయని,పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయని వారు అంటున్నారు. మండలంలో వరి కోతలు మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో, వరి కోత యంత్రాలకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు డీజిల్ అవసరం ఎక్కువగా ఉంది,మండలం లొ డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో మూడు పెట్రోల్ బంకులు, పెగడపల్లి లో ఒకటి, వెన్నంపల్లి లో ఒకటి ఉండగా అన్ని నో స్టాక్ బోర్డ్ లు పెట్టి కనబడుతూ ఉన్నాయి. మరోవైపు యుద్ధ పరిస్థితులను చూపెడుతూ, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు ప్రజల్లో వెలువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ప్రభుత్వం చొరవ చేసుకొని, రైతుల వరి కోతల యంత్రాలు డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నామని అంటున్నారు.











