పాము కాటుకు మహిళా మృతి.
ప్రజా గొంతుక (మే 19) కాల్వ శ్రీరాంపూర్: పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన వెన్నపళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన పూసల వజ్రమ్మ అనే మహిళ తన ఇంటి ముందు ఉన్న వాకిలి ఊడుస్తుండగా, మహిళ ఎడమ కాలుపాదం పై నాగుపాము కాటు వేయగా, ఈ విషయాన్ని పక్కింటి వారికి మహిళా తెలుపడం తో,వారు వడ్రంగి పని నీమిత్తం పెద్ద పెళ్లికి వెళ్లిన మహిళ కుమారుడు పూసాల రమణ చారి కి సమాచారం తెలపడంతో, తను గ్రామానికి వచ్చి, తన తల్లిని పెద్దపెల్లి లోని ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స కోసం తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మహిళా మృతి చెందినట్లు వారికి తెలపడంతో, మృతురాలు కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు…
Post Views: 155











