కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి మృతి… కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్కర్స్ వెంకటేష్ గుండెపోటుతో మృతి చెందారు. వారి పార్థివదేహానికి సర్పంచ్ అల్వాల నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మా చారి, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ , జిల్లా సందీప్, గుర్రపు బాలరాజు, చెరుకూరి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కర్స్ వెంకటేష్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఉన్న పాల్గొనేవారని, పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తిని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని వేడుకున్నారు.
Post Views: 33











