ఇందిరమ్మ చీరల పంపిణీతో సందడి.. కుక్క పిల్లల దత్తతతో ప్రత్యేక ఆకర్షణ……..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:29ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం – జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం – మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డినల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సందడిగా సాగింది… జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు…అదే వేదికపై జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుక్క పిల్లల దత్తత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మొత్తం 64 మంది డాగ్ లవర్స్‌కు కుక్క పిల్లలను దత్తతగా అందజేశారు…ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అని అన్నారు…వర్షాకాలంలో కుక్క కాట్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు…చిన్నారులు, పాఠశాల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు…మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూపేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు…దత్తత తీసుకున్న కుక్క పిల్లలను ఇంట్లోనే ప్రేమగా పెంచుకోవాలని, వీధుల్లో వదిలేయొద్దని సూచించారుకార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.











