*మాదిగల అభివృద్ధే ఎమ్మార్పీఎస్ ధ్యేయం*
*గొల్లపెల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ మండల సమావేశం*
జగిత్యాల జిల్లా ,జూన్ 05 దిశ పవర్ న్యూస్ ప్రతినిధి (గంగాధర మధుసూదన్)
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “గో టూ విలేజ్ – 40 డేస్” కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశాన్ని ధర్మపురి నియోజకవర్గ కోఆర్డినేటర్ బోనగిరి కిషన్ మాదిగ, గొల్లపెల్లి మండల అధ్యక్షుడు చెవులమద్ది రమేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ, ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను యువతకు వివరించారు.
మాదిగ సమాజ అభ్యున్నతికి విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.
అలాగే యువత అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో మాదిగ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు బొల్లె అనిల్ మాదిగతో పాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











