ప్రజా పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం.. బండనగరంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం!
— ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న జెడ్పీ సీఈవో రంగారావు, ఎస్హెచ్ఓ ఎన్. శ్రీకాంత్
— అధికారుల సమక్షంలో సమస్యల పరిష్కారానికి వేదిక: ఇజ్జగిరి రాములు
బచ్చన్నపేట:
నిరుపేద బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అయిన సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు కొనియాడారు. బచ్చన్నపేట మండలo లోని బండనగరం గ్రామంలో ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు ఇజ్జగిరి రాములు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా జెడ్పీ సీఈవో రంగారావు, బచ్చన్నపేట ఎస్హెచ్ఓ ఎన్. శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును జెడ్పీ సీఈవో రంగారావుతో కలిసి నాయకులు ఘనంగా ప్రారంభించారు.
గ్రామసభలతో సమస్యలకు పరిష్కారం:
ఈ సందర్భంగా ఇజ్జగిరి రాములు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి నివాసం కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ గ్రామసభల ద్వారా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వచ్చి, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.గొడవలు వద్దు.. స్నేహంగా మెలగండి: ఎస్హెచ్ఓ శ్రీకాంత్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ మరియు గ్రామీణ ఐక్యతపై బచ్చన్నపేట ఎస్హెచ్ఓ ఎన్. శ్రీకాంత్ మార్గదర్శక ప్రసంగం చేశారు. గ్రామాల్లోని రైతులు, కుటుంబాలు తమ మధ్య వచ్చే చిన్న చిన్న భూమి వివాదాలు, చిన్నాచితా గొడవలను అనవసరంగా పెద్దవి చేసుకొని కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. వివాదాలను గ్రామ పెద్దల సమక్షంలో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటూ, ఒకే తాటిపై స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లయ్య,ఎంపీవో, ఎన్. రఘురామకృష్ణ,ఏఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్బి. చామంతి – ఏఈఈ, ఇరిగేషన్
ఆర్. వెంకట్,వైద్యాధికారి డాక్టర్ సృజన, ఏ ఈ ఓ
జైరాజ్, జి పి ఓ సూర్యప్రకాశ్, సబ్ ఇంజనీర్
అజయ్ కుమార్ సెక్రటరీ టి.ప్రశాంత్, ఆరేళ్ల భాస్కర్, ఇప్ప శ్రీధర్ రెడ్డి, శివరాత్రి నరేష్, రాజు రెడ్డి,ఇజ్జగిరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.











