తులం బంగారం ఎక్కడ..? కళ్యాణ్ లక్ష్మి తో తులం బంగారం ఇచ్చిన ఊర్లోనే ఓట్లు అడగాలి..
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పిరోజ్
దిశ పవర్ బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో తిరిగినప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎక్కడ? అని నిలదీయాలని సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు ఎండి ఫిరోజ్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తమ ప్రభుత్వం వస్తే పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న తులం బంగారం ఇస్తలేరు, తులం బంగారం హామీ బోగస్ అయ్యిందని అన్నారు .మాజీ సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు మేనమామ లాగ ఆదుకొని లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి సమయానికి ఇస్తుండే అన్నారు. ఇప్పటికైనా పెండ్లి అయినా ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి,తో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిపాలన చేస్తున్న ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలులో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. మూడో విడత రైతుబంధు ఇంతవరకు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని అన్నారు. ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలు భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ఇచ్చిందని, ఏనాడు రైతులను ఇబ్బందులకు గురి చేయలేదని గుర్తు చేశారు.











