స్టేషన్ ఘన్పూర్, జూన్ 19,( దిశ పవర్): రానున్న వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని 13 వ వార్డులో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని దశల వారిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తాటికొండ యాదగిరి, సింగపురం వెంకటయ్య, సింగపురం ఎల్లయ్య, చింత జోసెఫ్, గద్దల యాదగిరి, మారపాక ప్రశాంత్, మేడ యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 72











