E-PAPER

డ్యూటీకి డుమ్మా.. తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె. రమేష్ సస్పెన్షన్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డ్యూటీకి డుమ్మా.. తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె. రమేష్ సస్పెన్షన్

08 Aug 2026, 10:56 am DISHA POWER

దిశ పవర్ ఆందోల్ నియోజకవర్గం, ఆగస్టు 7: జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. రమేష్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 5న నైట్ డ్యూటీకి తాను హాజరుకాకుండా, తన స్థానంలో ఓ ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఈ ఘటనను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా పరిగణించారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా జడ్. చోంగ్తును ఆదేశించారు.విచారణ అనంతరం డాక్టర్ కె. రమేష్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా, డాక్టర్ రమేష్ స్థానంలో నైట్ డ్యూటీ నిర్వహించిన ప్రైవేట్ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.అదేవిధంగా ఆసుపత్రి విధుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!