మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్
దిశ పవర్: జనగామ మున్సిపల్ సిబ్బంది జాలిగం రాజు, మున్సిపల్ జవాన్ తాళ్లపల్లి ఎల్లేష్ తండ్రి సంజీవ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వారి మృతి పట్ల జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించిన చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Post Views: 17











