E-PAPER

దేవాదుల కాలువ ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దేవాదుల కాలువ ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి

12 Aug 2026, 12:43 pm DISHA POWER

బచ్చన్నపేట, దిశ పవర్: బచ్చన్నపేట మండలానికి సాగునీరు అందించే దేవాదుల కాలువను ధ్వంసం చేసి నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కన్నబోయినగూడెం నుంచి గోపరాజుపల్లి మీదుగా బచ్చన్నపేట మండలానికి వస్తున్న దేవాదుల కాలువను కొందరు ధ్వంసం చేసి, నీటిని మళ్లించారని ఆరోపించారు. దీంతో మండలానికి రావాల్సిన సాగునీటికి ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.దేవాదుల నీరు బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల రైతులకు ఎంతో కీలకమని, ప్రస్తుత వర్షాకాలంలో సాగునీటి అవసరాలు మరింత పెరిగాయని తెలిపారు. కాలువ ధ్వంసం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ధ్వంసమైన కాలువకు తక్షణమే మరమ్మతులు చేపట్టి బచ్చన్నపేట మండలానికి యథావిధిగా దేవాదుల నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్పంచులు ఎండి ఫిరోజ్, మద్దికుంట రాధ, పోతుల వెంకటేష్ యాదవ్, నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, కనకయ్య గౌడ్, నీల మురళి, పేరబోయిన పరశురాములు, అల్వాల ఎల్లయ్య, జావిద్, సిద్ధారెడ్డి, బైరి వెంకటేష్, కర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!