దిశ పవర్ బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కిందపడి గాయపడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంధమల్ల జంపయ్యను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగీరు సత్తయ్య పరామర్శించారు. జంపయ్య గాయపడిన విషయం తెలుసుకున్న సత్తయ్య బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జంపయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన రాగీరు సత్తయ్య, సామాజిక బాధ్యతతో తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. జంపయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.సమాజ సేవలో ముందడుగు వేసిన రాగీరు సత్తయ్యకష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ, తన వంతు సహాయ సహకారాలు అందించడం ద్వారా రాగీరు సత్తయ్య సామాజిక దృక్పథాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహాత్మాచారి, జిల్లా నాయకులు జిల్లా సందీప్, గంధమల్ల కిష్టయ్య, అవధూత శ్రీనివాస్, బొమ్మెర్ల యాదగిరి, పోచంపల్లి శ్రీను, తమ్ముడి మహేందర్, నీల రమేష్, అల్వాల ఉప్పలయ్య, అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు.











