మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లోఫేర్వెల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ……సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లో నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కాలేజీ కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఆహ్వానించినందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో సాగింది.











